*ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్ర మంత్రి ప్రకటించటం విడ్డూరం:గౌని ఐలయ్య కన్వీనర్

బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటి*
బయ్యారం, సెప్టెంబర్27(జనంసాక్షి):
విభజన చట్టంలో నిర్ధిష్టంగా హామీ యిచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ పెట్టడం సాధ్యం కాదని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించటం విడ్డూరంగావుందని సిపిఐ ఎంఎల్ నాయకులు గౌని ఐలయ్య అభిప్రాయపడ్డారు. చట్టబద్దంగా యిచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వుందన్నారు.తెలంగాణకు చట్టబద్దంగా రావాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కొట్లాడి సాధించాల్సిన స్థానంలో వున్న కిషన్ రెడ్డిగారే పరిశ్రమ సాధ్యం కాదని చెప్పటం సిగ్గు చేటు. ముడి ఖనిజం క్వాలిటీ లేనందున ఉక్కు పరిశ్రమ పెట్టటం లేదనేది సాకు మాత్రమే. అసలు ఖనిజమేలేని విశాఖ స్టీల్స్ 500 కి.మీ దూరం నుండి ఖనిజాన్ని, బొగ్గును, డోలమైట్ ను తెచ్చుకొంటూ లాభాలు గడిస్తుంటే అన్ని వనరులున్న బయ్యారంలో సాధ్యం కాదనటం హాస్యాస్పదం. కిషన్ రెడ్డి తన ప్రకటనను వెనక్కు తీసుకొని కేంద్రాన్ని ఒప్పించి బయ్యారం ఉక్కు పరిశ్రమను తీసుకు రావాలి. తెలంగాణ హక్కును హరించే విధంగా వ్యవహరించటం సరికాదన్నారు.
Attachments area