హైదరాబాద్,ఫిబ్రవరి25( జనం సాక్షి): ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు ప్రభుత్వం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు హెల్ప్ లైన్‌కు 75 పోన్ కాల్స్ వచ్చాయని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారి యోగ క్షేమాల కోసం ఎప్పటికప్పుడు భారత విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. జీఏడి ముఖ్య కార్యదర్శి, ఢల్లీిలోని రెసిడెంట్ కమిషనర్ సంబంధిత అధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.




