Tuesday, 3 November 2026

“““““““““““
.
“““““““““““

““““““

““““`
“““`
“““`

““““““““`
దొంగలముఠా బీభత్సం
నల్గొండ,ఫిబ్రవరి25( జనం సాక్షి):జిల్లాలోని నార్కట్‌ పల్లి పట్టణంలో అర్ధరాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా మారణాయుధాలతో హల్‌ చల్‌ చేసింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టాª`గ్గంªట్‌ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. దొంగల దోపిడీ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దీంతో పట్టణ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజీల దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.
““““““
కాశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత
శ్రీనగర్‌,ఫిబ్రవరి25( జనం సాక్షి): జమ్ముకాశ్మీర్‌ షోపియాన్‌ జిల్లాలోని అంషిపొరాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కశ్మీర్‌ పోలీసులు ఇద్దరు ముష్కరులను హతమార్చారు. ఘటనాస్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో సహా నేరారోపణ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉన్నాయని పోలీసులు వెల్లడిరచారు.
““““““““`