మూడేళ్లుగా పాలనా వికేంద్రీకరణతో ఫలితాలు
విద్య, వైద్యం,వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి
రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,04,758 కోట్లు
గ్రావిూణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్ల ఖర్చు
3వేల కి.విూ పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి
మన బడి నాడు`నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
కొత్తగా 16 మెడికల్ కళాలలను నెలకొల్పుతున్నాం
రైతుభరోసా కింద ప్రతి రైతుకు రూ.13,500 ఆర్థిక సహాయం
2023 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ ప్రసంగం
అమరావతి,మార్చి7(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్ లో ఉగాది నుంచి కొత్త జిల్లాలో పాలన ప్రారంభం అవుతుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. మూడేళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, వికేంద్రీకరణతో రాష్టాభ్రివృద్ధి జరుగుతోందన్నారు. 2020`21 ఆర్థిక సంవత్సరంలో 0.22 జీఎస్టీపీ వృద్ధి జరిగిందన్నారు. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నామని, ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనా వ్యవస్థ ప్రారంభమవుతుం దన్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఉభయ సభలనుద్ధేశించి ప్రసంగించారు. గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,04,758 కోట్లు వస్తుందన్నారు. గ్రావిూణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్లను ఖర్చు చేస్తుందని, 3వేల కి.విూ పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తుందన్నారు. మన బడి నాడు`నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేపడుతుందని వెల్లడిరచారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 16 మెడికల్ కళాలలను నెలకొల్పుతుందని వివరించారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13,500లను ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం అందిస్తుందన్నారు. 2023 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ. 1,416 కోట్ల సాయం, వైఎస్‌ఆర్ వాహన మిత్ర కింద ఆటో, ట్యాక్సీ, డ్రైవర్లకు రూ. 770 కోట్లు . జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించిందని తెలిపారు. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ. 2,304 కోట్లు జమ చేసిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. అమ్మఒడి పథకం కింద 44.5 లక్షల మంది తల్లులకు రూ. 13,023 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడిరచారు. ’వైఎస్‌ఆర్ చేయూత ద్వారా 45`60 ఏళ్ల మహిళలకు రూ. 9,100 కోట్లు అందించిందన్నారు. వైఎస్‌ఆర్ కాపు నేస్తం కింద ఇప్పటి వరకు రూ. 981. 88 కోట్లు అందించిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఉద్యోగులకు ఒకేసారి 5 డీఏలు విడుదల చేశామని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. 11వ పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచామన్నారు. తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి రూ.2,04,758కి చేరిందన్నారు. నవరత్నాలు ద్వారా మానవ, ఆర్థిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నాడు`నేడు, ఆరోగ్యశ్రీ, బాలామృతం అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మూడు వాయిదాలలో.. రూ.13,500 ఆర్థిక సహాయం అందిస్తున్నా మన్నారు. పారదర్శక, అవినీతి రహిత పాలన అందిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్‌పోర్టును వేగవంతం చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు రూ. 2363.2 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు
అందించామని అన్నారు. వైఎస్సార్ జగన్ బడుగు వికాసం కింద షెడ్యూల్ కులాల పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక నైపుణ్యం కోసం రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోనే తొసారిగా మైక్రోసాఫ్టు అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిం చామని పేర్కొన్నారు. 2.98 లక్షలకు గాను 2.87 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45`60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వైఎస్సార్ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. కాపు నేస్తం కింది ఇప్పటివరకు రూ. 981.88 కోట్లు అందించామని తెలిపారు. ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున సాయం చేస్తున్నా మని చెప్పారు. గ్రావిూణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్ల వ్యయంతో 3 వేల కిలో విూటర్ల పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్టాన్రికి జీవనాడిగా ఉందిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ. 20, 162 కోట్ల సాయం చేశామని పేర్కొన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజంన చేకూర్చినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. 2021`2022లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులుకు ప్రయోజనం చేకూర్చామని పేర్కొన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్దిదారులకు రూ. 577 కోట్ల సాయం చేసినట్ల తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించినట్లు పేర్కొన్నారు. జగనన్న తోడు ప్రథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం అందజేసినట్లు గవర్నర్ తెలిపారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. మన బడి నాడు`నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శంగా పనిచేస్తున్నాయని గవర్నర్ తెలిపారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు.




