ఉచిత అల్పాహార పంపిణీ అభినందనీయం

పెద్దిరెడ్డి గణేష్

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : నిత్యం అల్పాహారాన్ని పంపిణీ చేయడం అభినందనీయమని సూర్యాపేట మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్ , పబ్లిక్ క్లబ్ సెక్రటరీ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఆధ్వర్యంలో తన కూతురు ఎన్నారై తన్నీరు దీప్తి రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా 73వ రోజు నిత్య ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ప్రతిరోజు పుట్టిన రోజులు , పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారు చేసే ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ చంద్ర , మిరియాల వెంకటేశ్వర్లు , మర్రు హనుమంతరావు , చిలుముల శ్రీనివాస రెడ్డి , రఫీ తదితరులు పాల్గొన్నారు.