*మేడిగడ్డ బ్యారేజి వద్ద పటిష్ట భద్రత*
ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు*
*పలిమెల, అక్టోబర్ 07 (జనంసాక్షి)* జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన పలిమెల మండలంతో పాటు మేడిగడ్డ బ్యారేజివద్ద ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతం మరియు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పలిమెల ఎస్సై అరుణ్ ఆద్వర్యంలో నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్సై అరుణ్ మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలు లేకుండా మేడిగడ్డ బ్యారేజి వద్ద మరియు పలిమెల మండలంలో నిత్యం తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ప్రజలతో మమేకమై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలందరు అవగాహనతో ఉండాలని వాహనాలు నడిపేటపుడు అన్ని పత్రాలు ఉంచుకోవాలని అన్నారు. కొత్త లేదా అనుమానిత వ్యక్తులకు సహకరించవద్దని సూచించారు. ఈ తనిఖీలలో ఎస్సై అరుణ్ వెంట సివిల్ మరియు సీఆర్పిఎఫ్ సిబ్బంది ఉన్నారు.