ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

జహీరాబాద్ ఆగస్టు 28 (జనంసాక్షి )  పట్టణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది జహీరాబాద్ పట్టణంలో రోటరీ క్లబ్ హైదరాబాద్ సెంటీనియల్ ఆధ్వర్యంలో ఎమ్మెన్నార్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు శిబిరంలో ఎంఎన్ఆర్ మెడికల్ సీఈవో భాస్కర్ రాజు ఆధ్వర్యంలో వైద్య బృందం పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు శిబిరానికి 400 మంది వరకు తరలివచ్చి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలను అందజేసి శాస్త్ర చికిత్సలు అవసరం ఉన్నవారికి ఎంఎన్ఆర్ఆసుపత్రిలో చేస్తామని తెలిపారు.జహీరాబాద్ రోటరీ క్లబ్ సహకారంతో విజయ వంతంగా చేయడం జరిగిందని  ఇక  ముందు మరి ఎన్నో కార్యక్రమలు చేస్తామని ఏ ఎస్ ఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ హైదరాబాద్  సెంటినీయల్ అధ్యక్షులు మహా వీర్ జైన్,  జహీరాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షులు,ఏనుగుల,శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ,లాల్ రెడ్డి,నామ రవి కిరణ్,గోవింద్ పలోడ్ తదితరులు పాల్గొన్నారు.