ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను యువతి యువకులు సద్వినియోగ చేసుకోవాలి.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 16(జనంసాక్షి) నేటి తరం లో కంప్యూటర్ ప్రతి ఒక్కరికి ఎంతో అవసర మని ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతు లను యువతి యువకులు సద్వినియో గం చేసుకో వాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు .శుక్రవారం తాండూర్ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అపెక్స్ హాస్పిటల్ పక్కన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కంప్యూటర్ శిక్షణ తరగతు లను యాజమాన్యం అన్నపూర్ణ పద్మనాభం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజ కవర్గ యువతీ యువకులు ప్రతి ఒక్కరు కంప్యూటర్ శిక్షణ తరగతులను సద్వినియోగ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సమస్థల చైర్మన్ రాజు గౌడ్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు, పట్టణ అధ్యక్షులు అప్పు నయిం , కౌన్సిలర్ మాంకాళ్ రాఘవేందర్, సంగీత ఠాగూర్, నాయకులు పట్లోళ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.