ఉచిత ఫిజియోథెరపీ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఉచిత ఫిజియోథెరపీ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చందన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు.ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని డాక్టర్ రామ్మూర్తి హాస్పిటల్ సమీపంలోని శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫిజియోథెరపీ క్లినిక్ లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మెడ నొప్పి , భుజం నొప్పి , మోకాలు నొప్పి , నడుము నొప్పి , మడమ నొప్పితో బాధపడేవారు, పక్షవాతం భాదితులు ఈ వైద్య శిభిరంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నెంబర్ 9848576660 ని సంప్రదించాలని తెలిపారు.