Friday, 6 November 2026

ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసి వర్కర్స్ యూనియన్.

సికింద్రాబాద్..(జనం సాక్షి )    సికింద్రాబాద్  జిహెచ్ఎంసి  సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కార్మికుల ఆరోగ్య భద్రత నిమిత్తం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు శంకర్ తెలిపారు.. మున్సిపల్ కార్యాలయంలో నిత్యం విధులలో మునిగిపోయి తీవ్ర ఒత్తిడిలో పనిచేసే ఉద్యోగులకు వారి ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భద్రత విషయంలో ప్రత్యేకంగా వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు.. ఈ పరీక్షలలో భాగంగా బీపీ, షుగర్, దంత, హృదయ,కంటి వైద్య పరీక్షలను నిర్వహించి వైద్యుల సలహాలు మేరకు మందులను కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు.. జిహెచ్ఎంసి లో ఉన్న హెల్త్ విభాగం ఈ ఉచిత హెల్త్ క్యాంపులో నిర్వహించాక పోయినప్పటికీ తమ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆరోగ్య మహాభాగ్యమని నినాదంతో తాము హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రకాష్ నర్సింగ్ పాండు జగదీష్ తదితరులు పాల్గొన్నారు..