ఉత్తమ వైద్యాధికారిగా జగదేవ్ పూర్ పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మహిపాల్
జగదేవ్ పూర్ ఆగస్ట్ 16 జనం సాక్షి :
ఉత్తమ వైద్యాధికారిగా మండల కేంద్రమైన జగదేవ్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మహిపాల్ కు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. జగదేవ్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి మహిపాల్ ఉత్తమ సేవలు అందించినందుకు ,అధిక సుఖప్రసవాలు నిర్వహించినందుకు గానూ జిల్లా స్థాయి ఉత్తమ వైద్యాధికారిగా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, వైద్యాధికారి మహిపాల్ ను అభినందిస్తూ జిల్లా స్థాయి ఉత్తమ అవార్డును అందజేశారు.