హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, హైదరాబాద్ ఆమెరికా కాన్సులేట్ జనరల్ సంయుక్త అధ్వర్యంలో పింక్ రిబ్బన్ వాక్ నిర్వహించారు. కేబీఆర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ నడకలో పలువురు. సినీ, క్రీడా ప్రముఖులు ఉత్సాహంగా పాల్గోన్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా తిరిగి కేబీఆర్ పార్క్ వనకు నడక సాగింది. ఈ కార్యక్రమంలో సినీ నటులు మోహన్‌బాబు, అమల, క్రికెటర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




