ఈ ఎన్నికల్లో ప్రభావం ఉంటుందన్న ఓటర్లు
హైదరాబాద్,డిసెంబరు7(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారిపై వేధింపులుకు దిగడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని పలువురు అంటున్నారు. పోలింగ్ సరిళి చూస్తే యువత అత్యధికుఅలు పాల్గొన్నారు. వారి మనోగతం కూడా అలాగే ఉంది. ఉద్యమంలో పాల్గొన్న వారికే రోణ లేకుండా పోయిందని తెలంగాణ వాదులు మండపడుతున్నారు. ముఖ్యంగా కోదండరామ్‌పై విమర్శలు,స్టూడెంట్స్‌పై వేధింపులు లక్ష్యంగా సాగుతున్న చర్యలను ఇంతకాలం ఖండిస్తున్నామని, ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపుతాయని అన్నారు. లంగాణ పోరాటంలో ముందున్న వారిని వేధించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. కోదండరామ్ సార్ కూటమిలో కీలక భూమిక పోషిస్తారని, ఆయన కూటమిలో చేరడంలో తప్పులేదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా చేసిన గట్టి పోరాటం వల్లే తెలంగాణ కల సాకారమైందని అభిప్రాయ పడ్డారు. కేసీఆర్ చేసిన దీక్షతో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజల త్యాగాలను తక్కువ చేసి.. రాష్ట్రాన్ని సాధించిన కీర్తిని కేసీఆర్‌కు ఆపాదించేందుకు కేసీఆర్ భజనపరులు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. కోదండరామ్ జోలికొస్తే నాలుక కోస్తా అని హెచ్చరించిన కేసీఆర్ ఆ మాటలను మరిచిపోయి.. కేటీఆర్ సిగ్గుఎగ్గు అని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .
ఉద్యమంలో అన్నీ తానై కాలికి గజ్జెకట్టిన విమలక్కని అసాంఘిక శక్తిగా అభివర్ణిస్తారా? అని ప్రశ్నించారు. 60 ఏళ్లకు పైగా సుధీర్ఘంగా జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ తనొక్కడి కృషి వల్లనే జరిగిందనే బిల్డప్ ఇప్తున్నారని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు చేసిన ఉద్యమాన్ని యథాతధంగా చరిత్రలో రికార్డు చేయాలని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర ఏర్పాటు కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారిపై కుట్రలు పన్నుతూ.. ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వలసలు, ఎనకౌంటర్లు లేని రాష్ట్రం.. ఆదివాసులకే అడవులు దక్కేలా, నిరుద్యోగం అనే సమస్యే లేని తెలంగాణ వస్తుందను
కున్నాం. కానీ, గత పాలకుల్లానే ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటుకు కారకులమని ఇప్పుడు చెప్పుకుని తిరుగుతున్న కొందరు ఆనాడు ఎక్కడ పోయారని ప్రశస్తున్నారు.




