ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనం సాక్షి) సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేసిన మోడీ జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దేశంలో నెలకొన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయ శంకర్ పాటిల్, నియోజకవర్గ అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో టీ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. శనివారం జహీరాబాద్ పట్టణంలో టీ దుకాణం వద్ద యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి టీ కొనుగోలు చేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాట తప్పారని గుర్తుచేశారు. దేశ ప్రధాని జన్మదినంను జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తేజ, నరేష్, బాబ్ల్యూ, నిజాం, సలాఉద్దీన్, ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు.