“ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనది
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది
ఫోటో రైట్ అప్ ఉత్తమ ఉపాధ్యాయుని సన్మానిస్తున్న ఎంపీపీ నెమ్మాది బిక్షం “
పెన్ పహాడ్. సెప్టెంబర్ 21 (జనం సాక్షి) :ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనదని ఎంపీపీ నెమ్మాది భిక్షం అన్నారు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పథకాలు అందుకున్న 30 మంది ఉపాధ్యాయులను మండల కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఉపాధ్యాయుల అంకిత భవంతో పనిచేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శేషగిరిరావు, మండల విద్యాధికారి నకిరేకంటి రవి, ఇంచార్జీ ఎంపిడిఓ బాణాల శ్రీనివాస్, సర్పంచ్ తూముల శ్వేత సురేష్ రావు ఎంపీటీసీ ఊరుకొండ జానకమ్మరాధాకృష్ణ, నిర్వాకులు సంధ్యల వినోద్ ,నల్ల శ్రీనివాస్, అల్లాడి సత్యనారాయణ, ఆయా పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.