ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

 ఉపాధ్యాయ సంఘ నాయకుల ముందస్తు అరెస్టు
పెద్దవంగర సెప్టెంబర్ 13(జనం సాక్షి ) ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్  మరియు టిపిటిఎఫ్ పెద్దవంగర మండల నాయకులు ఎర్ర వెంకన్న, గుర్రం శేఖర్, సోమారపు ఐలయ్య,చిక్కాల సతీష్, బుధవారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళుతున్న ఉపాధ్యాయులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేసి, బైండోవర్ చేయడం జరిగింది,  వారు  మాట్లాడుతూ 13 జిల్లాల భార్య భర్తల బదిలీలు అన్లాక్ చేయాలని,  మరియు 317 జీఓల వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని,  ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని ప్రమోషన్లు  ఇవ్వాలని కోరుతూ,అక్రమంగా అరెస్టు చేయడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నాం  శాంతి యుతంగా  సమస్యలను పరిష్కరించాలి అరెస్టులు బైండ్వర్లతో  ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు