దేశం కోసం వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివి

– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్
వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి బిజెపి నివాళులు
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 13 : భారత దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరువలేనివని బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ అన్నారు. మంగళవారం చేర్యాల పట్టణంలో స్థానిక అంగడి బజారు వద్ద వల్లబాయ్ పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజాం పాలన నుండి తెలంగాణ ప్రాంతానికి విముక్తికై సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ పోలో పోలీస్ చర్య ప్రారంభించిన రోజు అని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి చేర్యాల పట్టణ అధ్యక్షులు కాటం సురేందర్, చేర్యాల రూరల్ అధ్యక్షులు కాశెట్టి పాండు పటేల్, జనగామ ఇంచార్జి పోతుగంటి రామదాసు, జిల్లా అధికార ప్రతినిధి నర్ర మహేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేళ్ళ సురేందర్, గోపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు నర్సింహులు, మండల ప్రధాన కార్యదర్శి నరుకుల విజయ్ కుమార్,ఓ బీసీ మోర్చా మండల అధ్యక్షుడు అప్పల బాబు, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు చంద్రమౌళి,బిట్లు, శ్రీను, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.