నాంపల్లి అక్టోబర్ 23 (జనం సాక్షి )రాష్ట్రంలో సాగుతున్న దొరల అస్తవ్యస్తమైన పరిపాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండేదని హుందాగా రాజకీయాలు చేశారని తెలిపారు. తెలుగుదేశం హయాంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపదతోనే ఈరోజు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ విచ్చలవిడితనంతో ధనక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చాలని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని అన్నారు. కృష్ణరాయునిపెళ్లి. చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి చేయడంలో భూ నిర్వాసితులకు పరిహారం అందించడంలో ప్రాంతీయ వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు. మునుగోడు అభివృద్ధి పట్ల చిన్నచూపు చూస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలన్నారు . టిఆర్ఎస్ పార్టీ నుంచి చనాగేటి యాదగిరి,బాలు నాయక్ టీడీపీ లో చేరారు.ఈ ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మక్కన అప్పారావు,మండల పార్టీ అధ్యక్షుడు శేషారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోసుకొండ వెంకటేష్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లు మొగుధల పార్వతమ్మ, పగడాల లింగయ్య, ముద్ధం శ్రీనివాస్ గౌడ్. పుప్పాల యాదయ్య, రెడ్డిమల్ల రాములు, దనాబోయిన నరేష్, వజ్జ వెంకటరెడ్డి,గుర్రం భారత య్య,పోలేపల్లి ప్రకాష్, మంగి ముత్తయ్య,సదినల శ్రీనివాస రావు, గంస్య, నారపక నరసింహ, రాములు, ఆవుల రవీందర్, యాదగిరి డి వెంకన్న బ్రహ్మచారి, కొమ్మనబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు.
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలన ఐలయ్య




