*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించిన మండల బి ఆర్ యస్ నాయకులు*

కొడకండ్ల, అక్టోబర్23(జనంసాక్షి)
 నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కొడకండ్ల గ్రామానికి  మంజూరైన 1,60,000 రూపాయల సి యం ఆర్ ఎఫ్  చెక్కులను స్థానిక సర్పంచ్ పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, ఎంపీపీ ధారవత్ జ్యోతి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షుడు మసురం వెంకట నారాయణ,మండల కోఆప్షన్ సభ్యులు నజీర్, జిల్లా రైతు బంధు సభ్యులు భారత్ శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు దేశగాని సతిష్, పి నవీన్,మాజీ ఉప్ప సర్పంచ్ రమేష్,యాదగిరి,లబ్ధిదారులు గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.