ఉమ్మడి కోటగిరి మండలంలో అంబరాన్నంటెల కేసిఆర్ జన్మదిన సంబరాలు.ఉమ్మడి కోటగిరి మండలంలో అంబరాన్నంటెల కేసిఆర్ జన్మదిన సంబరాలు.


కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-కోటగిరి,పోతంగల్ మండలాలలో శుక్రవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్పీకర్ ఆదేశాల మేరకు ఉమ్మడి కోటగిరి మండల బిఅర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో పలు ఆలయాలు,దర్గాలలో కెసిఆర్ పేరున ప్రత్యేక ప్రార్ధనలు చేసి స్వీట్లు,పండ్లను పంపిణీ చేసి,కేక్ కట్ చేస్తూ కెసిఆర్ జన్మదిన వేడుకలను సంబరంగా నిర్వహించారు.అదేవిధంగా ఉమ్మడి మండలాలలోని ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు కెసిఆర్ జన్మదినం సందర్భంగా మొక్కల ను నాటారు.అనంతరం కోటగిరి మండల కేంద్రంలోని అమ్మా అనాధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ జన్మదిన వేడుకలలో ఉమ్మడి మండలాల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, సర్పంచ్ ఫోరం అద్యక్షులు పత్తి లక్ష్మణ్,ఎన్డీసీసీబి డైరెక్టర్ శాంతిశ్వర్ పటేల్,సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దు,ఎఎంసి చైర్మన్ హమీద్,వైస్ చైర్మన్ రాంరెడీ, సుంకిని,ఎత్తోండ,జల్లాపల్లి ఫారం సర్పంచ్లు మాధవ రావ్,సాయిబాబు,షేరు,ఎంపీటీసీ ఫారుక్ సీనియర్ నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్,విజయ్ పటేల్,సలీం, బాబుఖాన్,జుబేర్,మండల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు