ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ అధ్యక్షులుగా వలివేటి వీరభద్రశర్మ

సూర్యాపేట (జనంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ అధ్యక్షులుగా తనను నియమిస్తూ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్  గంగు ఉపేంద్ర శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయం అర్చకులు  వలివేటి వీరభద్ర శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రచార్యులు, రాష్ట్ర ఉద్యోగ  సంఘం అధ్యక్షులు  తాండూరి కృష్ణమాచారికి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ అర్చకుల,ఉద్యోగుల వేతనాలను  పెంచడంలో ప్రధాన పాత్ర పోషించారనీ అన్నారు.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో జిల్లాలో అర్చకుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా పలువురు అర్చకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.