ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య… 

వికారాబాద్ జిల్లా జనం సాక్షి : ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వికారాబాద్ పట్టణం ఎన్నేపల్లి గ్రామానికి చెందిన డేవిడ్( 40) వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్ పేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు ఇదిలా ఉంటే గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుడి భార్య హేమలత ఎండోమెంట్ శాఖ లో పనిచేస్తుండగా హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు డేవిడ్ గత నెల రోజులుగా విధులకు హాజరు కనట్లు తెలుస్తుంది ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది…!!