పేరు మార్చుకున్న‌ ఫేస్ బుక్ : సీఈవో జుక‌ర్‌‌బర్గ్


సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్.. పేరు మార్చుకుంది. ఇక‌పై మెటా పేరుతో సేవ‌లు అందించ‌నుంది. ఆ సంస్థ సీఈవో జుక‌ర్‌‌బర్గ్ తాజాగా ఈ విష‌యాన్ని ప్రక‌టిం‌చారు. భ‌విష్య‌త్తులో మెటా‌వర్స్‌(వ‌ర్చువ‌ల్ రియాలిటీ) సాంకే‌తి‌కతకు పెర‌గ‌నున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈపేరు పెడుతున్న‌ట్టుగా స్ప‌ష్టం చేశారు. ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ‌లైన వాట్సాప్, మెసేంజ‌ర్, ఇన్‌స్టాగ్రామ్ పేర్ల‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయ‌డం లేద‌ని జుక‌ర్ బ‌ర్గ్ తెలిపారు. ఈ సంస్థ‌ల‌న్నింటికి ఇన్నాళ్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ‌గా కొనసాగ‌గా.. ఇప్ప‌టి నుంచి మెటా ఆ స్థానంలో కొన‌సాగ‌నుంది. వర్చు‌వ‌ల్ రియా‌లి‌టీలో యూజ‌ర్లు సంభా‌షిం‌చు‌కొ‌నేలా ఫేస్‌బుక్ త‌న ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దుతోంది.త్వరలో సేవ‌లను అందు‌బా‌టు‌లోకి తీసు‌కు‌రా‌నుంది.ఇదిలా ఉంటే.. ఫేస్‌బుక్ స‌మాచార దుర్వినియోగానికి పాల్ప‌డుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డంతోనే, దాన్నుంచి ప్ర‌పంచం దృష్టి మ‌ర‌ల్చేందుకు పేరు మార్పురు తెర‌పైకి తెచ్చింద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు…!!