ఊరుకొండలో ఘనంగా బోనాలు..

ఊరుకొండ, ఆగస్టు 25 (జనం సాక్షి):
ఊరుకొండ మండల కేంద్రములో స్థానిక ప్రజలు బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఊరుకొండలో బోనాలను పురస్కరించుకొని గ్రామంలోని మహిళలందరూ నియమ నిష్ఠలతో బోనాలు తయారు చేసుకుని తలపై ధరించి పుర వీదుల గుండా ఊరేగింపుగా డప్పులు బ్యాండ్ మేళాల మధ్య అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, మహిళా మణులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.