పాదయాత్ర పై కోర్టు తీర్పు కేసీఆర్ కు చెంప పెట్టు

 

* బీజేవైఎం మాజీ అధ్యక్షులు బోయినపల్లి ప్రవీణ్ రావు

కరీంనగర్ టు డే :
పాదయాత్ర పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంపపెట్టు అని బీజేవైఎం జిల్లా మాజీ అధ్యక్షులు బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బిజెపి చీఫ్ బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను కేసీఆర్ డైరెక్షన్ తో పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వ పాలనకు నిదర్శనం అన్నారు. పాదయాత్రతో బీజేపీకి బీజేపీకి వస్తున్నా మైలేజీని తట్టుకోలేక టిఆర్ఎస్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు నియంతృత్వ పోకడలను ప్రజలకు బండి సంజయ్ వివరిస్తున్నారు అని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ మాఫియా కేసు నుండి దృష్టిని మళ్ళించడానికి పాదయాత్ర కు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు పెట్టిన కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తప్పుడు కేసులు గా నిర్ధారించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రతి కార్యకర్త సైనికులుగా పని చేస్తున్నారని తెలిపారు.