ఎంగిలిపూల బతుకమ్మ తో మొదలైన బతుకమ్మ సంబరాలు
బోయిన్ పల్లి సెప్టెంబర్ 25 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని దుండ్ర పల్లి గ్రామంలో ఆదివారం రోజున ఎంగిలి పువ్వుల బతుకమ్మతో ప్రారంభమైంది. తీరొక్క పూలతో రోజొక్క తీరుగా తొమ్మిదిరోజులు బతుకమ్మను పేర్చి ఆడి పాడే మన తెలంగాణ మహిళల సంబురాలకు ఎంగిలిపూల బతుకమ్మతో ఆదివారం నుండి మండలంలోని అన్ని గ్రామాలలో పూల జాతర మొదలైంది ఒక్కేసి పువ్వేసి చందమామ. ఒక్క జాములాయె చందమామ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటలతో వాడవాడలలో పూలసింగిడి ప్రారంభమైంది.