ఎండిన మొక్కల స్థానంలో నూతన మొక్కల ఏర్పాటు

ఎంపీడీవో గణేష్ రెడ్డి

జనం సాక్షి/ కొల్చారం జాతీయ రహదారి పక్కన అధికారులు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 19వ తేదీన మెదక్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాల్లో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుతున్నట్టు ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఏపీ మహిపాల్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్కడా ఖాళీ స్థలం లేకుండా మొక్కలు నాటుతున్నామని గతంలో నాటిన మొక్కలు చనిపోగా వాటి స్థానంలో తిరిగి కొత్త మొక్కలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ అరుంధతి ఆంజనేయులు విట్టల్ శీను తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు