Thursday, 5 November 2026

*ఎంబి చర్చి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (14):మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీ లో గల డేవిడ్ మెమోరియల్ ఎం బి చర్చి ప్రహరీ గోడ నిర్మాణానికి మండల వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు లు బుధవారం భూమి పూజ చేశారు ఈ ప్రహరి గోడ మరియు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి పది లక్షల రూపాయలు మంజూరైనట్లు వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గాజుల కోదండం, మండల రైతు బంధు అధ్యక్షుడు తిరుపతయాదవ్, వార్డు సభ్యులు బాలస్వామి, మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మంద కోటేశ్వర్ రెడ్డి, కర్రోల్ల భాస్కర్, నాగరాజు, మహేష్, రవి, మరియు ఫాస్టర్స్ డేవిడ్, బెంజిమెన్, ఆశీర్వాదం, దస్తయ్య, గంధం చంద్రాయుడు, పెద్ద చంద్రయుడు, కర్రెన్న, చంద్రశేఖర్, చర్చి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు