హైదరాబాద్ : ఎంసెట్-2013 ప్రవేశ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ని ఎంసెట్ కన్వీనర్ రమణారావు ఇవాళ విడుదల చేశారు. ఎంసెట్ వెబ్సైట్లోనే కీని పొందుపరిచామని తెలిపారు. ‘కీ’ పై ఏవైనా అభ్యంతరాలుంటే విద్యార్థులు ఆన్లైన్లో లేదా నేరుగా జేఎన్టీయూ హైదరాబాద్లోని ఎంసెట్ కార్యాలయంలో సంప్రతించవచ్చని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఇంజినీరింగ్ ఫలితాలు జూన్ 2న విడుదల కావాల్సి ఉంది.




