Monday, 2 November 2026

ఎగ్జిబిషన్‌ సొసైటీ స్థలం లీజు మరో 99 ఏళ్లకు పొడిగింపు

ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఆగస్టు30 : ఎగ్జిబిషన్‌ సొసైటీ స్థలం లీజు మరో 99 ఏళ్లకు పొడిగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు సీఎంఓ నుంచి నోట్‌ సంబంధిత శాఖకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా చేరింది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ స్థలం లీజు పొడిగింపుపై త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఎగ్జిబిషన్‌ సొసైటీ స్థలం లీజు రద్దు వార్తలపై సీఎం కేసీఆర్‌ బుధవారం ఆరా తీశారు. ఓ ప్రముఖ దినపత్రికలో లీజు వ్యవహారంపై తప్పుడు కథనం ప్రచురితమైనట్లు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. స్థలం లీజు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించలేదన్నారు. మరోవైపు ఆర్‌అండ్‌బీశాఖ లీజు సరిగా నిర్వహించడం లేదని, రెవెన్యూశాఖకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. కేబినెట్‌ పెండింగ్‌ నోటిఫికేషన్‌ తో హైదరాబాద్‌ కలెక్టర్‌ ద్వారా 99 ఏళ్లకు లీజు కొనసాగించాలని రెవిన్యూ శాఖకు సీఎం గతంలో సూచించారు.