తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్,ఆగస్టు30 : మెడికల్ సీట్ల భర్తీపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గురువారంతో మెడికల్ కాలేజీ సీట్ల భర్తీకి సంబంధించి గడువు ముగియనున్న నేపథ్యంలో సుమారు 20 రిట్ పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ముఖ్యంగా ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటాల్లో సీట్ల భర్తీలో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీ,సీ కేటగిరీల్లో సీట్ల భర్తీకి సంబంధించి నివేదిక ఇవ్వాలని కాళోజీ వర్శిటీకి న్యాయస్థానం ఆదేశిస్తూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.




