శ్రీరంగాపురం ఆగస్ట్ 27 (జనంసాక్షి):
శ్రీరంగాపురం మండలంలోని ఎనిమిది గ్రామాలకు సంబంధించిన పంచాయితీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వనపర్తి జిల్లా డిఆర్డిఒ నర్సింహులు తెలిపారు. తేది.01.11.20120 నుంచి 31.03.2022 వరకు చేపట్టిన ఉపాధిహామి పథక పనుల సోషల్ ఆడిటింక్ తనిఖీలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రజావేదికను నిర్వహించారు. దీనితో పాటు హరితహారం పనుల్లో కూడా లోపం గుర్తించామని,ఎనిమిది గ్రామాలలో రూ.8249 రూపాయలను రికవరి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో విజిలెంన్స్ ఆఫీసర్ రహీం,ప్రొసిడింగ్ ఆఫీసర్ కృష్ణయ్య,సత్యనారాణ రెడ్డి,ఎంపిపి గాయత్రిపృథ్వీరాజ్,వైస్ ఎంపిపి మహేశ్వర్ రెడ్డి,జడ్పిటిసి రాజేంద్రప్రసాద్ యాదవ్,సర్పంచ్లు,ఎంపిటీసీలు,ప్ రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్:
27ఎస్స్ఆర్పి01:కార్యక్రమంలో మాట్లాడుతున్న డిఆర్డిఒ నర్సింహ్ములు.




