ఎనిమిది సంవత్సరాలు అధికారం ఇచ్చిన- ప్రజల బ్రతుకుల్లో మార్పు లేదు-

బిజెపి నాయకులు భాస్కర్ రెడ్డి-

కాటారం అక్టోబర్ 10(జనంసాక్షి)భారతీయ జనతా పార్టీ కాటారం మండల అధ్యక్షుడు  బొమ్మన భాస్కర్ రెడ్డి పత్రికా విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన  హక్కులతో ప్రజాస్వామ్య దేశంలో పార్టీల పేరు మార్చడంసహజమే కేవలం ప్రచార ఆర్భాటాల తో జాతీయస్థాయిలో కేసీఆర్ మరియు కెసిఆ ర్ కుటుంబం ఏదో సాధించినట్లు ప్రసారసాధ నాల్లో ఊదరగొట్టడం హాస్యస్పదముగా ఉంది  జాతీయ పార్టీగా చెప్పుకోవాలంటే మొదట గా జాతీయభావనఉండాలి.కానీ కెసిఆర్ కేవలం తన కుటుంబ పాలన అధికార కేంద్రీకరణ పట్ల మాత్రమే విశ్వాసం కనబరుస్తారని తెలంగాణ ప్రజలందరికీ విదితమే అనునిత్యం తప్పుడు నివేదికలతో విదేశాలను పొగిడి భారత అభి వృద్ధిని తక్కువగా చూపేసంకుచితమనస్తత్వం గల కేసీఆర్ వ్యవహార శైలి ఉపప్రాంతీయ పార్టీకి సరిపోలి ఉంటుంది ప్రజలమ నోభావా లతో ఆడుకోవడం,అబద్ధపు హామీలు ఇవ్వ డం,ఓట్ల కోసంఎన్నికల సమయంలో మభ్య పెట్టే మేనిఫెస్టోలు రూపొందించడం కేసిఆర్ కు టుంబానికి అలవాటుఅధికారంలోకి వచ్చాక ఎన్నికలు ముగిశాక హామీలను విస్మరించడం, తనకురాజకీయంగాఉపయోగపడిన వారిని అణగదొక్కడం,వారి వ్యక్తిత్వ హననం చేయ డం కెసిఆర్ రాజకీయ రీతి.అధికారాన్ని అడ్డు పెట్టుకొని కెసిఆర్ కేసీఆర్ కుటుంబం,టిఆర్ ఎస్ పార్టీ, వేల కోట్లు సంపాదించి అధికార యావతో తెలంగాణ ప్రజల్లో తన పట్ల పెరిగిన వ్యతిరేక భావనను పక్కదారి పట్టించడానికి జాతీయ పార్టీ అని తెలంగాణ పేరువాడుకో వడానికి చిల్లర ప్రయత్నాలు చేసినాడు తెలం గాణలోని సబ్బండ వర్గాలు,కెసిఆర్ పాలన తో,కెసిఆర్ కుటుంబ అహంకా రంతోఅభివృ ద్ధిని కోల్పోయి ప్రభుత్వ పరంగా సరైన దిశలో సాగాల్సిన పాలన అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం వేగంగా ప్రజల్లో మద్ద తు కూడ కట్టుకుంటున్న భారతీయ జనతా పార్టీని నేరుగా ఎదుర్కోలేక ఇలా పార్టీల పేరు మార్పు,హెలికాప్టర్లు విమానాలు అని ప్రచా రాలు చేసుకుంటూ ప్రజల దృష్టిని మన్నించే యత్నంలో భాగమే ఈ తతంగం.కెసిఆర్,తన కుటుంబం ఎన్ని కుప్పిగంతులు వేసి న వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే అవకాశమే లేదు. తెలంగాణ ప్రజల మద్ద తుతో,తెలంగాణ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా సగర్వంగా ఎగరేయడం తధ్యం. గౌరవ నరేంద్ర మోడీ గారి సుపరిపాలన తెలం గాణ ప్రజలకు మరింత చేరువ కావడంకా యం ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు  బొమ్మన భాస్కర్ రెడ్డి మండల ప్రధాన కార్యద ర్శి పూసల రాజేంద్రప్రసాద్ జిల్లా కిసాన్ మో ర్చా ప్రధాన కార్యదర్శి  బండం మల్లారెడ్డి సీని యర్ నాయకుడు ఉడుముల వెంకట్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

2 Attachments • Scanned by Gmail