Sunday, 8 November 2026

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమాజ సేవలో ముందుండాలి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 24(జనం సాక్షి)
 వరంగల్ నగరంలోని ఏవివి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొడిమల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం 53వ జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.   ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ఎస్ఎస్  జాతీయ అవార్డు పొందిన మహమ్మద్ ఆజం విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ యొక్క ఉపయోగాలు వాటి వలన కలిగే వ్యక్తిత్వ వికాసము ,ప్రజలకు సేవ చేయే మహత్తరమైన అవకాశం ఎన్ఎస్ఎస్ ద్వారా  లభిస్తుందని ఎన్ఎస్ఎస్ లో ఆక్టివ్ గా ఉన్నవారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని అన్నారు.   కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సమాజ సేవ చేయాలని తద్వారా వారి యొక్క వారిలో నాయకత్వ లక్షణాలు పొందుతాయని మరియు సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో పూర్వ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ బరుపాటి గోపి గారు, సంజీవ గారు, అధ్యాపకులు జి శ్రీనివాస్, డాక్టర్ వి. శ్రీధర్ ,డాక్టర్ వేణుగోపాల్ ,సీనియర్ వాలంటీర్స్, వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Attachments area