అభివృద్ది,సంక్షేమ పథకాల ఎజెండాతో పటిష్ట కార్యాచరణ
కాంగ్రెస్,బిజెపిలకు అందనంత వేగంగా కదులుతున్న పావులు
హైదరాబాద్,మే8(జనం సాక్షి): వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్‌లను మట్టి కరిపించేందుకు సిఎం కెసిఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో పాటు తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కెసిఆర్ మంచి ఇమేజ్‌తో అధికారంలోకి వచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ అదే ఇమేజ్ పనిచేయదని కెసిఆర్‌కుకూడా తెలుసు. అందుకే ఇప్పటినుంచే పథక రచన చేస్తున్నారు. బిజెపి దూకుడును కూడా గ్రహించి ముందుకు సాగుతున్నారు. బిజెపి నుంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు, కాంగ్రెస్‌ను మట్టి కరిపించేందుకు సిఎం కెసిఆర్ సంక్షేమ కార్యక్రమాల జోరు పెంచారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో విపక్షాలకు అందకుండా కెసిఆర్ శరవేగంగా దూసుకుని పోతున్నారు. రానున్న ఎన్నికలకు ఎజెండా ఏమిటోచాలా స్పష్టంగా ఉండబోతోంది. గత ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ సెంటిమెంట్‌తోనే ఎన్నికలు సాగాయి. తెలంగాణలో చాలా చోట్ల ముఖ్యంగా ఉద్యమం జోరుగా సాగిన జిల్లాల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన టీఆర్‌ఎస్ వైపే మొగ్గుచూపారు. ఉద్యమంలో పాల్గొన్న అనేకులు టిక్కెట్ సాధించి గెలుపొంకాంగ్రెస్ టీడీపీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతోంది. దీంతో తెలంగాణలో రాజకీయ శరవేగంగా మారుతోంది. అయితే కెసీఆర్ అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్, వైసీపీ టిక్కెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. కానీ ఇఫ్పుడు 2019 నాటి పరిస్థితి ఏ మాత్రం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సెంటిమెంట్ ఇక ఏ మాత్రం పనికిరాదని కెసిఆర్ గ్రహించారు. అందుకే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పెంచారు. వివిధ వర్గాలను బుట్టలో వేసుకునేలా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు తాజా బడ్జెట్ కూడా ఉదాహరణగా చూడాలి. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు అయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పెద్దగా నేరవేరటంలేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. టీజెఏసీ నేత కోదండరాం నేరుగా పోరాడుతున్నారు. .నిరుద్యోగ సమస్య, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, వంటివి లేవనెతత్తుతున్నారు. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చేస్తున్న ముందస్తు కసరత్తుగానే చెబుతున్నారు. అయితే వీటిని అధిగమించేలా కెసిఆర్ మాస్టర్ ప్లాన్‌తో నడుస్తున్నారు. ఇకపోతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా ఫిరాయించి వచ్చిన వారికి మంత్రి పదవులతో పాటు పలు కీలక పదవులు దక్కటం టీఆర్‌ఎస్ లో ప్రారంభం నుంచి ఉన్న నేతలకు ఏ మాత్రం రుచించటం లేదన్న విమర్శలు పక్కకు పోయాయి. వాటిని అధిగమించి అంతా తెలంగాణ కోసం అన్న నినాదం ముందుకు వచ్చింది. ఇకపోతే కొన్న అసంతృప్తులు సిఎం కెసిఆర్‌పైనా ఉన్నా అవి నేతలకు సంబంధించినవి మాత్రమే. మంత్రులు.. ఎమ్మెల్యేలు కూడా పార్టీ అధినేత, సీఎం కెసీఆర్ తమను అసలు కలవటం లేదని..పార్టీ అధినేతను కలవటమే గగనం అయిందనే భావనలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగా ఈ విషయాన్ని వ్యక్తం చేయకపోయినా..అధినేత తీరుపై పార్టీలోనూ అసంతృప్తి ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీటితో ప్రజలకు ఏమాత్రం సబంధం లేదు. ప్రజలు కిందిస్థాయిలో కార్యక్రమాలు సాగుతున్నాయా లేదా అన్నది చూస్తారు. అందుకే కెసిఆర్ ఈ విమర్శలకన్నా ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే విపక్ష కాంగ్రెస్ గతంలోఎన్నడూలేని రీతిలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని విమర్శలు చేస్తోంది. మిషన్ కాకతీయ కూడా అక్రమాల పుట్టగా మారిందని తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నది. దీనిని కూడా సర్కార్ గట్టిగానే ఎదుర్కొంటే విమర్శలకు గట్టి సమాధానం ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీని చులకన చేయడం ద్వారా దానికి
స్థానం లేకుండా చేస్తోంది. ఈ వాస్తవాలను గ్రహించే సర్కారు ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో వరస పెట్టి కులాల వారీగా హావిూలు ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చి ప్రచారం చేస్తోంది. ఇవన్నీ పనిచేస్తాయో లేదో కానీ కెసిఆర్ వ్యూహం ముందు డీలాపడక తప్పని స్థితి ఏర్పడిరది. బిజెపి, కాంగ్రెస్‌లను మళ్లీ దరి చేరకుండా సంక్షేమ పథకాలకు పదను పెడుతున్నారు.




