ఎన్ ఎస్ యూ ఐ జిల్లా కార్యదర్శి గా జోగుల ఎబినేజర్ నియామకం.

తాండూరు సెప్టెంబర్ 7(జనంసాక్షి)
కాంగ్రెసు పార్టీ అనుబంధ సంస్థగా పేరున్న ఎన్ ఎస్ యూ ఐ విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యూ ఐ వికారబాద్ జిల్లా కార్యదర్శిగా జోగుల ఎబినేజర్ నియామిస్తున్నట్టు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ ఓ ప్రకటన లో తెలిపారు.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యూ ఐ నాయకులు
ఎబినేజర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ నియోజక వర్గంలో లేనంత ఎన్ ఎస్ యూ ఐ కార్యక్రమలు విద్యార్థుల కోసం పోరటలు తాండూర్ నియోజక వర్గంలో ఉన్నాయన్నారు. దీని ఫలితంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని అధికార పార్టీ నాయకులు విద్యార్థి నాయకుల పై ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రలోభలకు గురి చేసిన ఎన్ ఎస్ యూ ఐ కోసం పార్టీ కోసం పని చేసే వారిని కపాడుకునే భాధ్యత ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ మనపై ఉందని మాకు అండంగా ఉంటు ధైర్యాన్ని ఇస్తాడని తెలిపారు.
రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం.
నాపై నమ్మకం ఉంచి మంగళవారం జిల్లా స్థాయి లో గుర్తింపు ఇచ్చిన ఎన్ ఎస్ యూ ఐ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తాండూర్ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్నపుడే సుమారు 20 కేసులు ఉన్న నన్ను జిల్లా కార్యదర్శి గా అదనపు భాద్యత లు ఇవ్వడంతో ఆ సంఖ్య రెట్టింపు అవుతుందని ఎన్ని కేసులు పెట్టిన ప్రలోభలకు పెట్టిన ఎప్పటికీ అప్పుడు విద్యార్థి సమస్యల పై అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపడం లో ముందు వరుసలో ఉంటానని
తెలిపారు.