ఎన్ పి ఆర్ డి రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి
నర్సింలు మండల అధ్యక్షుడు
దోమ సెప్టెంబర్ 12(జనం సాక్షి)
వికలాంగుల సంక్షేమ పథకాలు చట్టాలపై సదస్సును విజయవంతం చేయాలని ఎంపీ ఆర్డీ పిలుపు . వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తేదీ 13 మంగళవారం నాడు పరిగి మండలం శారద గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరగబోయే రాష్ట్ర సదస్సును వికారాబాద్ జిల్లా వివిధ గ్రామాల వికలాంగులు గ్రామ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు కలిసి ఈ సదస్సును విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు జయ దశరథ్ పిలుపునిచ్చారు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం అలాగే వికలాంగుల చట్టాల అవగాహన కల్పించడం కోసం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వికలాంగులకు సంబంధించినటువంటి సమస్యలపై అలాగే వారికున్న సంక్షేమ పథకాలపై అవగాహన తెలియజేయడం జరుగుతుందని అన్నారు అలాగే గ్రామ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం జరగవలసిన ప్రాంతము పరిగి మండల్ శారద గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తేదీ 13 ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది కనుక అధిక సంఖ్యలో వికలాంగులు పాల్గొని ఈ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ సావిత్రమ్మ పరిగి మండల అధ్యక్షుడు బి నర్సింలు మండల కార్యదర్శి సత్యమ్మ మండల కమిటీ సభ్యులు సునీత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు