Wednesday, 4 November 2026

ఎఫ్‌సీఐ పరీక్ష కేంద్రం మార్పుపై ఫైర్‌

హైదరాబాద్‌: ఎఫ్‌సీఐ (పుడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఉద్యోగాలకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షా కేంద్రాన్ని మార్చడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాన్ని విశాఖపట్నంకు కమిషన్‌ మార్చింది. హైఐదరాబాద్‌లో పరీక్ష రాసేందుకు 32 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ విశాఖ వెళ్లాలంటే ఒక్కొక్క అభ్యర్థికి రూ.5 వేల అదనపు భారం పడుతుందని పీఆర్‌టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి తెలియజేశారు. కావున పరీక్షను హైదరాబాదలోనే నిర్వహించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *