Wednesday, 4 November 2026

*ఎమ్మార్పీఎస్ నిరసన*

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి )  జూలై 29 :- శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు శుక్రవారం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాలు మేరకు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గత 27 సంవత్సరాలుగా పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని చేపడుతున్న ప్రతి ఉద్యమానికి మద్దతు ప్రకటించిన భారతీయ జనతా పార్టీ నేడు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాల గడువు ముగుస్తున్నప్పటికీ పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టకపోవడం ఎంతో దుర్మార్గమని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ఈ నెల 20 వ తేదీ నుండి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఎస్సీలకు న్యాయం చేయని యెడల జాతీయ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి భారతీయ జనతా పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మా సంకల్పాన్ని నెరవేర్చుకుంటామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ హాజరై  మద్దతు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు తోకల చిరంజీవి మాదిగ, స్టేట్ సెక్రటరీ బైరాపోగు శివ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ పంగ ప్రణయ్ మాదిగ, కళా మండలి జిల్లా అధ్యక్షుడు గజ్జల రామచందర్ మాదిగ, బీర్రు సునీల్ మాదిగ, మేడ స్వామి మాదిగ, మాట్ల శ్రీనివాస్ మాదిగ, గుర్రం లక్ష్మణ్ మాదిగ, జవహర్ నగర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు  కొయ్యడ వెంకటేష్ మాదిగ, కొయ్యడ ఐలయ్య మాదిగ,శ్రీరాములు మాదిగ, నగునూరి ప్రభాకర్ మాదిగ  తదితరులు పాల్గొన్నారు.
Attachments area