ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి మీకు లేదు.

అవినీతి అక్రమాలకు నిలయం దుబ్బాక మున్సిపాలిటీ.
భారతీయ జనతా మజ్దూర్ సెల్ జిల్లా కన్వీనర్ మచ్చ శ్రీనివాస్.
దుబ్బాక ఆగష్టు 01,( జనం సాక్షి )
సిద్దిపేట జిల్లాలోనే నెం 1 అవినీతికి నిలయం దుబ్బాక మున్సిపాలిటీ అని భారతీయ జనతా మజ్దూర్ సెల్ జిల్లా కన్వీనర్ మచ్చ శ్రీనివాస్ అన్నారు.బుధవారం రోజు దుబ్బాక పట్టణ కేంద్రం బిజెపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. హరితహారం పేరుతో లక్షల రూపాయలు అవినీతి సొమ్మును వాటా  వేసుకొని పంచుకున్నది మీరు కాదా. గత సంవత్సరం దుబ్బాకలో జరిగిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అడ్డగోలుగా ఖర్చులు రాసి కాజేసింది నిజం కాదా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఏం అభివృద్ధి జరిగిందో సమాధానం చెప్పాలని వారు మండిపడ్డారు. దుబ్బాక శాసనసభ్యులు 24 గంటలు ఈ నియోజకవర్గ ప్రజల కోసం శ్రమిస్తున్నారని తెలియజేశారు. 8 సంవత్సరాల నుండి ఎంపీగా ఉండి దుబ్బాక నియోజకవర్గం ఏం వరగపెట్టినారు తెలుపాలని స్వర్గీయ రామలింగారెడ్డి  ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గంలో కాలు మోపడానికి భయపడింది నిజం కాదా. ఎంపీ సొంత ఊర్లోనే ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ఆపలేని దద్దమ్మలు ఎమ్మెల్యే ని విమర్శిస్తున్నారు అధికార బలం అవినీతి సొమ్ము వెనకేసుకుని ఎమ్మెల్యే ని విమర్శిస్తే ఊరుకోమని వారు హెచ్చరించారు.నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకు ప్రవీణ్, గాజుల భాస్కర్, వెళ్లే సంజయ్, మరాటి  బాలాజీ, రాజేష్, మోత్కుపల్లి బద్రి, పల్లె మనోజ్, పల్లె నిహాల్, బొప్పాపురం నరేష్, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.