Friday, 6 November 2026

ఎమ్మెల్యేలందరూ మాతోనే ఉన్నారు: కాంగ్రెస్‌

హైదరాబాద్‌: తమ ఎమ్మెల్యేలందరూ తమతో టచ్‌లోనే ఉన్నారని కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరన్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ‌కర్ణాటకలో పూర్తి మెజారిటీ నిరూపించుకుని అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.