శ్రీనగర్,మే18(జనం సాక్షి ): కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోమారు పాక్ ఉల్లంఘించింది. పాక్‌కు ఇది పరిపాటిగా మారింది. జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు తెగపడింది. పాక్ కాల్పుల్లో ఇద్దరు పౌరులు దుర్మరణం చెందారు. శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న పాక్ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాన్ సీతారం ఉపాధ్యాయ వీరమరణం పొందాడు. పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది. సరిహద్దు గ్రామాలను టా/-గ్గం/ట్‌గా చేసుకొని పాక్ కాల్పులు జరుపుతుండడంతో ఆ గ్రామాల ప్రజలను బలగాలు అప్రమత్తం చేశాయి.




