Thursday, 5 November 2026

ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన పందుల సురేష్

మోత్కూరు ఆగస్టు 26 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని 6 వ వార్డ్ ఇందిరానగర్ కాలనీ కి చెందిన పందుల సురేష్ తలకు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయం కావడంతో తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్ ఎల్ఓసి ద్వారా లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకోవడంతో తలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తిరిగి కోలుకున్న పందుల సురేష్ శుక్రవారం ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ వనం స్వామి, జిల్లా ఎస్సి ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దాసరి తిరుమలేష్,
సాయి,ప్రవీణ్ తదితరులు ఉన్నారు.