ఎమ్మెల్యే గండ్రను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు…..

*టిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో శవయాత్ర…….
టేకుమట్ల.అక్టోబర్11(జనం సాక్షి)జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీ  నాయకులకు లేదని టిఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో  శవయాత్రను నిర్వహించారు.అనంతరం చౌరస్తాలో దగ్ధం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలలో గెలవాలి అనడం హాస్యపదంగా ఉందని, పూటకు పార్టీ మార్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్న  వ్యక్తి ఎన్ని పార్టీలు మారాడు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని వారన్నారు.ఈ కార్యక్రమంలో  పిఎసిఎస్  డైరెక్టర్ దొడ్ల కోటి,యూత్ విభాగం మండల నాయకులు  ఎండి అక్రమ్,నానవేని కుమారస్వామి,శాస్త్రాల రాజు, ఆకునూరు సతీష్,మేకల రాజు, ఇచ్చంతుల రాజ్ కుమార్, గంపల రాజవీరు,ఈర్ల సతీష్, రేణిుకుంట్ల రాజు కుమార్, సొల్లేటి నరేష్,బట్టల విక్రం, పోల్సాని రవీందర్,శ్రీకాంత్, మధుకర్,రాకేష్, కూకట్ల దేవేందర్, మేకల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area