ఎమ్మెల్యే చిన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. – బీఆరెస్ నెన్నెల మండల అధ్యక్షుడు పంజాల విద్యాసాగర్ గౌడ్.


బెల్లంపల్లి, జులై 22, (జనంసాక్షి )
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆరెస్ నెన్నెల మండల అధ్యక్షుడు పంజాల విద్యాసాగర్ గౌడ్ అన్నారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెన్నెల మండలం అభివృధి పథంలో ముందుకు నడుస్తున్న క్రమంలో కొందరు కావాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో మండలం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకి తెల్సని అన్నారు. గడ్డం వినోద్ స్థానికంగా ఉండరని, అతను మంత్రిగా ఉన్నప్పుడు మండలానికి రోడ్లు కూడా లేవని, కనీస వసతులు కూడా లేవని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చిన్నయ్య మండల పరిధిలోని ఒక గ్రామ స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే గా గెలిచి ఎన్నో అభివృధి పనులు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ కు అసలు మండలంలో ఎన్ని గ్రామాలుఉన్నాయో తెల్వదన్నారు. కొందరిని పెట్టుకొని ఇలా విమర్శించడం సరి కాదని అన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి, పార్టీ నాయకులకు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆరెస్ నాయకులు సింగతి రాంచందర్, సంతోషం ప్రతాప్ రెడ్డి, జాడి రాజేష్, బతిని వెంకటేష్ గౌడ్, మహేందర్, ఒరెం మల్లయ్య, సల్ల శ్రీనివాస్ రెడ్డి, గురునాదం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు