మణిపూర్ ప్రజలపై జరుగుతున్న హంతక దాడులు మోడీ ప్రభుత్వం చేయిస్తున్నవే

 

వరంగల్ ఈస్ట్ జూలై 22 (జనం సాక్షి)గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసకాండ సృష్టికర్త మోడీ ప్రభుత్వమేనని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆరోపించారు.ఈరోజు మణిపూర్ ఆదివాసి ప్రజలపై మణిపూర్ మైదాన ప్రాంత జాతి చెందిన మైతి వర్గం వారు ఆదివాసి కుకీ నాగ ప్రజలపై జరుపుతున్న దాడులను నిరసిస్తూ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు సెంటర్లో ధర్నా నిర్వహించారు న్యూ డెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆరెల్లి కృష్ణ ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్ ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి ప్రతాపరెడ్డి పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్లు మాట్లాడారుకుకి తెగకు చెందిన మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారం హత్య చేయడం ఈ దేశంలో ఆదివాసి ప్రజలకు ఎంతటి భద్రత ఉందోతెలియజేస్తున్నదన్నారు ఈ ఘటనపై ఆదివాసి మహిళగా రాష్ట్రపతి స్పందించాలని వారు డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద సహజ సంపదలను మోడీ బడా దోపిడిధారైన కార్పొరేట్ ఆదానికి అప్పగించింది ఈ అడవుల నుండి నాగ కుకీజాతి ఆదివాసి ప్రజలను వెళ్లగొట్టే పనిలో మైదాన ప్రాంత మైతి వర్గానికి చెందిన వారిని ఎస్టీ జాబితాలో చేర్చి , హత్యలు దాడులు చేయిస్తున్నది భారత రాజ్యాంగంలోని ఐదు ఆరు షెడ్యూల్లో అటవీ ప్రాంత ఆదివాసి ప్రజల హక్కులు ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వము వీటిని ఖతార్ చేయకుండా దేశంలోని అటవీ ప్రాంతాలు అన్నింటిని సామ్రాజ్యవాదదోపిడీకి అదాని, అంబానీలకు కట్టబెడుతున్నది అడవి ప్రాంతాల అభివృద్ధి పేరా గిరిజనులను గెంటివేసి చేసే ఈ విధ్వంసాన్ని ఖండించాలని మణిపూర్ ఆదివాసి జాతులకు అండగా ఉండాలని ప్రజలు ప్రజాస్వామ్యవాదులను వారు కోరారు.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు ఐ ఎఫ్ టి యు నాయకులు గన్నారం రాజేందర్ ఎర్రజబాబు జయబాబు పి వై ఎల్ నాయకులు సుమన్ హరిబాబు షేర్ మధు ఎండి అక్బర్ లతోపాటు ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు

తాజావార్తలు