ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ఘన

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ఘన
స్వాగతం.
తేనీటి విందులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు అక్టోబర్ 8(జనంసాక్షి)దసరా పండుగ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని తుల్జాపూర్ భవాణి మాత దర్శనానికి పాదయా త్రగా బయలుదేరే భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ నుండి బయలుదేరిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కర్ణాటక రాష్ట్రం హుమ్నాబాద్ దగ్గర నూర్ ధాబా దగ్గర తాండూరు నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకులతో కలిసి తేనీటివిందు లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, తాండూర్ మండల అధ్యక్షుడు రాందాస్, సీనియర్ నాయకులు ఇందర్ చెడ్ రాజు పటేల్, పట్లోళ్ల నర్సింలు, ఉమా శంకర్, శ్రీనివాస్ చారి, వేణు గౌడ్, అంబరీష్, రాకేష్ తదితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.