ఎమ్మెల్యే మదన్ రెడ్డికి తిరిగి టికెట్ ఇవ్వాలి: రవీందర్ గౌడ్, కొల్చారం మండల బీసీ విభాగం అధ్యక్షుడు
జనం సాక్షి/ కొల్చారం
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి శాసనసభ ఎన్నికల్లో తిరిగి టిక్కెట్ ఇవ్వాలని కొల్చారం మండల బి ఆర్ ఎస్ బిసి విభాగం అధ్యక్షులు కొమ్ముల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి 2 పర్యాయాలు టిఆర్ఎస్ తరఫున గెలిచి మచ్చలేని నాయకుడు నియోజకవర్గ ప్రజలను తన సొంత బిడ్డలు గా చూసుకుంటున్నాడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మంత్రి హరీష్ ల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు అన్నారు. తెలంగాణ ఉద్యమం నుండి పార్టీని నమ్ముకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ను నమ్ముకొని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తున్నాడు అన్నారు అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని ఇతరులకు పార్టీ టికెట్ కేటాయిస్తే తాము పార్టీకి రాజీనామా చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సొసైటీ డైరెక్టర్ దుర్గేష్, సీనియర్ నాయకులు బండి రమేష్, లలిత , విద్యా కమిటీ చైర్మన్ నాగరాజు, ఎంపిటిసి సభ్యులు మాధవి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.