శ్రీధర్ బాబు ను కలిసిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నేతలు, కాంట్రాక్ట్ కార్మికులు
జనంసాక్షి, రామగిరి : సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల గురించి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలో తన గొంతును వినిపించి సింగరేణిలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని గవర్నమెంట్ కి తెలియజేసినందుకు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబును బుధవారం కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు రాసూరి శంకర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగూడెం నుంచి అధ్యక్షులు రాసూరి శంకర్, అదే విధంగా డ్రైవర్ల విభాగం ఇంచార్జ్ భాష బోయిన రవికుమార్, అర్జీ టు ఏరియా వైస్ ప్రెసిడెంట్ సాదుల రాజేశం సమక్షంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కన్వెన్షన్ డ్రైవర్లు బుధవారం ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కలిసి సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఆర్టిజన్ పేరు మీద ఎలాగైతే కెటిపిఎస్ లో పర్మినెంట్ చేశారో అదే విధంగా సింగరేణిలో కూడా చేయాలని అప్పటివరకు 60 నెంబర్ జీవో నైనా అమలుపరచాలని ఆ విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని వారు శ్రీధర్ బాబును కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్జి 2 ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.