ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాల్చిపడేస్తానని అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై ఈరోజు వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు పిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే మర్రి జనార్దన్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.